కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.దీంతో నారాయణపూర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది.
మరోవైపు మంగపేట గ్రామానికి సమీపంలో ఉన్న చెరువు నీటిమట్టం ఎక్కువగా ఉంది.దీంతో అధికారులు చెరువు కట్ట తెంపడానికి జేసీబీతో వచ్చారు.
అయితే అధికారులను మంగపేట గ్రామస్తులు అడ్డుకున్నారు.చెరువు కట్ట తెంపితే తమ పొలాలతో పాటు ఇళ్లు మునుగుతాయని వాపోతున్నారు.
ఈ క్రమంలో గ్రామస్తులకు, అధికారులకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.