ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాటూరి రవిచంద్ర శిల్పకళలో ఆరి తేరాడు.తండ్రి వెంకటేశ్వరరావు నుంచి శిల్పకళను అందిపుచ్చుకుని ఎన్నో కళాత్మక రూపాలను తయారు చేస్తున్నాడు.
వారిది ఆరు తరాలుగా ఇదే కళలలో ఎంతో నైపుణ్యమున్న వారిగా కీర్తిగడించారు.ఇక రవిచంద్ర వారి బాటలోనే పయనించాడు.
హైదరాబాద్ జేఎన్టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యనభ్యసించాడు.మరిన్ని మెళకువలను అందిపుచ్చుకోవడం కోసం కోల్కతా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో మాస్టర్స్ చేశాడు.
ఆ సమయంలో గోల్డ్ మెడల్ సాధించి, దానిని గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నాడు.ఆ తర్వాత తన తండ్రి ప్రారంభించిన కాటూరి ఆర్ట్ గ్యాలరీలో చేరి, ఎన్నో అద్భుతమైన, చూడ చక్కని కళాకృతులకు ప్రాణం పోస్తున్నాడు.
ఇప్పటి వరకు తండ్రితో కలిసి అతడు 30కి పైగా కళాకృతులను తయారు చేశాడు.వాటిలో సింహం, పులి, నెమలి, రోబో, గాంధీ, మోడీ రూపాలు ఉన్నాయి.ఎన్నో అవార్డులు అందుకున్న అతడిని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.పనికిరాని వాటితో ప్రయోగాలు చేసి, వాటిని చక్కటి విగ్రహాలుగా మలుస్తున్న తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుతం తెనాలిలోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ రోడ్డులో చిట్టి ఆంజేయస్వామి ఆలయం వద్ద తమ ఆర్ట్ గ్యాలరీలో మరెన్నో కళాకృతులను తయారు చేయడంలో నిమగ్నమయ్యాడు.