అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని దుర్మరణం, పోలీస్ వాహనమే మృత్యు శకటమై

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని దుర్మరణం పాలైంది.

 Telugu Woman Killed In Road Accident In America , Jahnavi, America, Telugu Woman-TeluguStop.com

మృతురాలిని జాహ్నవి కందులగా గుర్తించారు.ఈమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు డెక్స్‌టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో జాహ్నవి నడుచుకుంటూ వెళ్తుండగా.సౌత్ లేక్ యూనియన్‌లోని సీటెల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలైంది.సమాచారం అందుకున్న సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుబంధ మెడికో టీమ్ ఘటనాస్థలికి చేరుకుని చికిత్స ప్రారంభించింది.

సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది.

ఈ విషయాన్ని భారత్‌లోని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు.ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటుందని భావించిన కుమార్తె తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో జాహ్నవి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదిలావుండగా.గత నెలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారతీయ యువకుడు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.మృతుడిని 26 ఏళ్ల మన్‌ప్రీత్‌ సింగ్‌గా గుర్తించారు.పెన్సిల్వేనియా రాష్ట్రం క్లారియన్ టౌన్‌షిప్‌లో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

మన్‌ప్రీత్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తున్నారు.తన వ్యక్తిగత వాహనంలో డిసెంబర్ 24న ఉదయం 6.30 గంటలకు పెన్సిల్వేనియా వెళ్తున్న సమయంలో క్లారియన్ టౌన్‌షిప్‌ వద్ద వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో మన్‌ప్రీత్ వాహనం కూడా చిక్కుకోవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

సహాయక బృందాలు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయాడు.

Telugu America, Township, Dexter, Jahnavi, Thomas Street, Seattle, Pennsylvania,

మరోవైపు.రెండ్రోజుల క్రితం చికాగోలో తెలుగు విద్యార్ధులపై నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.హైదరాబాద్‌కి చెందిన దేవ్‌శిష్ అనే విద్యార్ధి ప్రాణాలు కోల్పోగా.కొప్పాల సాయిచరణ్ అనే విద్యార్ధి తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇదే ఘటనలో విశాఖకు చెందిన లక్ష్మణ్ అనే మరో యువకుడు తృటిలో తప్పించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube