ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలని కలలు గంటున్న భారతీయ యువత.అమెరికా సహా వివిధ దేశాలకు వెళ్తున్నారు.
అయితే అక్కడ అనుకోని ప్రమాదాల బారినపడి ప్రాణాలను కోల్పోతున్నారు.దీంతో కన్నవారి బాధ వర్ణనాతీతం.
తాజాగా అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే… నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతి కిరణ్ రెడ్డి (25) ఎంఎస్ చదివేందుకు గతేడాది అమెరికాకు వెళ్లాడు.
అనంతరం అక్కడి వారెన్స్‌బగ్‌లోని మిస్సోరి సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాడు.ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన రాత్రి 7.30 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న కిరణ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కిరణ్ మరణవార్తను అమెరికాలోనే ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి బావమరిది అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కొడుకు మరణవార్తతో శ్రీనివాస్ రెడ్డి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కిరణ్‌రెడ్డి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇకపోతే.గత నెల 22న అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం చికాగో సమీపంలోని అలెగ్జాండర్ కౌంటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్ధులు మరణించిన సంగతి తెలిసిందే.
విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో పీచెట్టి వంశీకృష్ణ (23), అతని స్నేహితుడు పవన్ స్వర్ణ (23), కారును నడుపుతోన్న మహిళా డ్రైవర్ మేరీ ఎ.మెయునియర్ (32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అదే కారులో వారితో పాటు ప్రయాణిస్తున్న డి.కల్యాణ్, కె.కార్తీక్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లకు గాయాలయ్యాయి.
ఈ ఐదుగురు విద్యార్ధులు కాబండేల్ టౌన్ లోని సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎం.ఎస్ చేస్తున్నారు.వీరిలో కళ్యాణ్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతుండగా… మిగిలిన వాళ్లంతా కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు.వంశీకృష్ణ, పవన్‌లు హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కాలేజీలో బీటెక్ చదువుకున్నారు.ఎంఎస్ చేసేందుకు గతేడాది నవంబరులో అమెరికా వెళ్లారు.వంశీకృష్ణ తల్లి పద్మజా రాణి జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.