సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు ఇవే!

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా రెండు లేదా మూడు సినిమాలు కచ్చితంగా విడుదలవుతున్నాయి.సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి సక్సెస్ సాధిస్తే కచ్చితంగా ఆ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Telugu States Sankranti Festival Flop Movies Yogi Vinaya Vidheya Rama Agnathavas-TeluguStop.com

అయితే కొన్ని సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైనా వేర్వేరు కారణాల వల్ల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అలా ఫ్లాపైన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

2019 సంవత్సరం సంక్రాంతి కానుకగా చరణ్ బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ రిలీజ్ కాగా ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.2018 సంక్రాంతి కానుకగా పవన్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి రిలీజ్ కాగా ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.2014 సంక్రాంతి కానుకగా విడుదలైన 1 నేనొక్కడినే సినిమా కూడా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.

బాలయ్య వైవీఎస్ చౌదరి కాంబినేషన్ లో తెరకెక్కి 2008 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఒక్క మగాడు సినిమా కూడా ఫ్లాప్ అయింది.ప్రభాస్ వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కి 2007 సంక్రాంతి కానుకగా విడుదలైన యోగి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.2004 సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి అంజి సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

2002 సంక్రాంతి కానుకగా విడుదలైన టక్కరి దొంగ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.2001 సంవత్సరం సంక్రాంతి కానుకగా మృగరాజు సినిమా రిలీజ్ కాగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఇలా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై నిరాశపరిచిన సినిమాల జాబితా ఎక్కువగానే ఉంది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube