టాలీవుడ్ నటుడు నరేష్, ఆయన మూడవ భార్య రమ్య రఘుపతి గురించి మనందరికీ తెలిసిందే.నరేష్ రమ్య రఘుపతి ఇద్దరు 2010లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
ఈ దంపతులకు కొడుకు కూడా జన్మించాడు.నరేష్, పవిత్రా లోకేష్ విషయంలో రమ్య రఘుపతి మండిపడుతూ మీడియా రచ్చ రచ్చ చేసింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య రఘుపతి గతంలో ఎన్నడూ చేయని ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
నరేష్, తనకు ఏజ్ విషయంలో అబద్ధం చెప్పాడని నరేష్ తనకంటే 12 ఏళ్ళు పెద్దవాడని అబద్ధం చెప్పాడని కానీ అదంతా అబద్ధమని తనకంటే నరేష్ 20 ఏళ్ళు పెద్దవాడని చెప్పుకొచ్చింది రమ్య రఘుపతి.
మీ ఇంట్లో తల్లి తండ్రి మన పెళ్ళికి ఒప్పుకోరు లేచిపోయి వివాహం చేసుకుందాం అన్నాడు అని తెలిపింది రమ్య.అంతే కాకుండా పెళ్ళికి ముందే శృంగారం చేద్దామని నన్ను బలవంత పెట్టేవాడు.కొన్నిసార్లు పెళ్లి వద్దు సహజీవనం చేద్దాం అనేవాడు.
ఎన్ని చెప్పినా నేను వివాహానికి, ఆయనతో బంధానికి రాజి పడలేదు నువ్వు లేకపోతే నేను చాలా మిస్ అవుతాను.నిన్ను భార్యగా కావాలి అనుకుంటున్నాను అంటూ నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు.
ఆ మాటలకు నమ్మి నరేష్ ని వివాహం చేసుకున్నాను.
అయితే మొదట్లో నరేష్ బాగానే ఉన్నాడనీ కానీ ఆ తరువాత పవిత్ర లోకేష్ తో నరేష్ కి పరిచమయ్యాక వేధింపులు మొదలుపెట్టాడని ఆమె తెలిపింది.తనను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్న నరేష్, అందు కోసం ఆమెకు మరొకరితో అక్రమ సంబంధాలు అంగట్టేవాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడేవాడని రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది.
అయితే ఏది ఏమైనా నరేష్ కి నేను విడాకులు ఇచ్చేది లేదని ఆమె కుండబద్దలు కొడుతున్నారు.ఎందుకంటె నా కొడుకు తండ్రి కావాలి.
వాడి కోసం నేను నరేష్ ని వదిలేదు అని తెలిపింది రమ్య రఘుపతి.కాగా రమ్య రఘుపతి ఇన్ని ఆరోపణలు చేసినా నరేష్ నోరు మెదపలేదు.
ఆయన మౌనంగా ఉన్నారు.మరి నరేష్, రమ్య వాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.