టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కు అంతర్జాతీయ స్థాయిలో పదుల కొద్ది అవార్డులు దక్కాయి.అంతే కాకుండా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా దక్కించుకోగా.
ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయిన విషయం తెల్సిందే.ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచి పోయే విధంగా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు సంపాదించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాట కు మన వద్ద దక్కుతున్న గౌరవం ఎంత అంటే మాటల్లేవ్.

కేంద్ర ప్రభుత్వం నాటు నాటు పాటకు స్వరాలు అందించిన సంగీత దర్శకుడు కీరవాణికి పద్మ అవార్డును అందించి గౌరవించింది.కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఇప్పటి వరకు కీరవాణిని పట్టించుకోలేదు.ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఆస్కార్ లో ఉంచడం కోసం రాజమౌళి చాలా ప్రయత్నించారు.దాదాపుగా 50 కోట్ల రూపాయలను ఆయన ఖర్చు చేశారు అనేది టాక్.
ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ వారు సినిమా ను ఆస్కార్ కు అధికారికంగా పంపించక పోవడంతో రాజమౌళి స్వయంగా ఓపెన్ కేటగిరీలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ఆస్కార్ కు పంపించాడు.

ఆయన ప్రయత్నం ఫలించి నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు కు గాను నామినేషన్ దక్కింది.అద్భుతమైన నాటు నాటు కు ఆస్కార్ వారి గుర్తింపు దక్కింది కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల వారు రాజమౌళి టీమ్ కు ప్రోత్సహకాన్ని ప్రకటించలేదు.సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి అభినందిస్తున్నాం అంటూ వదిలేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి.
తెలుగు సినిమా కు ఒక్క రాష్ట్రం కాకుండా రెండు రాష్ట్రాలు ఉన్న కారణంగా ఏ రాష్ట్రం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన నేపథ్యంలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
ప్రభుత్వాలు కూడా రాజమౌళి టీమ్ కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
