తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ – Telugu NRI America News

1.తానా పుస్తక మహోధ్యమానికి విశేష స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పుస్తక మహోద్యమం ఘనంగా జరిగింది.

ప్రవాస భారతీయులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

2.న్యూయార్క్ లో వీధికి గణేషుడి పేరు

 

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఓ వీధికి అక్కడి అధికారులు గణనాథుడు పేరు పెట్టారు.న్యూయార్క్ లోని క్వీన్స్ ఐరో లోని ప్లషింగ్ లోని ఓ వీధికి గణేష్ టెంపుల్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. 

3.ప్రయాణికులకు  గో ఎయిర్ గుడ్ న్యూస్

  ఇండియన్ ఎయిర్ లైన్ గో ఎయిర్ లైన్ కీలక ప్రకటన చేసింది.అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ కు రోజువారి విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 

4.గల్ఫ్ లో ఘనంగా రంజాన్ మాసం ప్రారంభం

 

గల్ఫ్ దేశాల్లో ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ఘనంగా ప్రారంభమైంది. 

5.దక్షిణ కొరియా పై అణు దాడి చేస్తాం : కిమ్ సోదరి హెచ్చరిక

  దక్షిణ కొరియా పై అణు బాంబులతో దాడి చేస్తామంటూ దక్షిణ కొరియా ను కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ హెచ్చరించింది. 

6.టీచర్ కు మరణశిక్ష విధించిన ఇండోనేషియా కోర్టు

 

విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించి 13 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడిన , హెర్రీ విరావన్ (36 ) కు ఇండోనేషియా కోర్టు మరణ శిక్ష విధించింది. 

7.రహస్యంగా హైపర్ సోనిక్ మిస్సైల్ ను పరీక్షించిన అమెరికా

  లాక్  హీడ్ మార్టీన్ కంపెనీ తయారు చేసిన హైపర్ సోనీ మిస్సైల్ ను అమెరికా రహస్యంగా పరీక్షించింది. 

8.శ్రీలంకను ఆదుకోవాలంటూ ప్రధాని కి అభ్యర్థన

 

Advertisement

తీవ్ర ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న శ్రీలంకను ఆదుకోవాలంటూ ఆదేశ ప్రతిపక్షనేత సాజిత్ ప్రేమదాస భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. 

9.రష్యాపై ఉక్రెయిన్ ఆరోపణలు

  ఉక్రెయిన్ లో లో రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 165 మంది చిన్నారి చనిపోయారని అధికారులు వెల్లడించారు.ఉక్రెయిన్ రష్యా సాగిస్తున్న యుద్ధం మంగళవారానికి 41 వ రోజుకు చేరుకుంది. 

10.22 యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేసిన కేంద్రం

 

దేశ భద్రతకు విదేశీ సంబంధాలకు విఘాతం కలిగిస్తున్న 22 యూట్యూబ్ ఛానల్స్ ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది.

Advertisement

తాజా వార్తలు