తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.కువైట్ లో ఇద్దరు భారతీయుల అరెస్ట్

కువైట్ లోని వా ప్రాంతంలో ఇంట్లో తయారు చేస్తున్న మద్యం విక్రయిస్తున్న ఇద్దరు భారతీయులను అహ్మదీ పోలీసులు అరెస్టు చేశారు.

2.భారత విద్యార్థులకు అండగా హైకమిషన్

కెనడాలో మూడు ప్రైవేట్ కాలేజీలు ప్రకటన చేయడం తో ఉన్నత విద్య కోసం కెనడా వెళ్ళిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆవేదన ఆందోళన చెందారు.దీనిపై కెనడా కమిషన్ స్పందించింది.ఈ సందర్భంగా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

3.భారతీయుడు తో బ్రిటన్ దౌత్యవేత్త వివాహం

భారత్ లో బ్రిటన్ దౌత్యవేత్త గా పనిచేస్తున్న రియానన్ హారీస్ భారతీయుడైన హిమాన్షు పాండే ను వివాహం ఆడారు.

4.ఉక్రెయిన్ ను వీడాలి అంటూ భారతీయులకు సూచన

రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఇంకా తగ్గని నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారతీయులు ఆ దేశాన్ని వీడాలి అంటూ అక్కడి భారతీయ ఎంబసీ తాజాగా మరోసారి సూచించింది.

5.లండన్ లో ఎయిర్ ఇండియా విమానం కి తప్పిన ముప్పు

లండన్ లో ఎయిర్ ఇండియా విమానం కి పెను ముప్పు తప్పింది.తుఫాను గాలులు, భీభత్స వాతావరణం కారణంగా హీత్రో ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ను పైలెట్లు విజయవంతంగా ల్యాండింగ్ చేశారు.

6.ఆస్ట్రేలియా విమానంపై లేజర్ ప్రయోగించిన చైనా

Advertisement

ఆస్ట్రేలియా విమానంపై చైనా నౌక లైజర్ ప్రయోగించింది.ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు.

7.భారత్ పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తత

భారత్ పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.భారత్ కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది.

8.యుక్రెయిన్ లో టెన్షన్ .తొలి మరణం నమోదు

ఉక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల ఏర్పాటు వాదుల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి.వేర్పాటువాదుల దాడిలో తూర్పు యుక్రెయిన్ ప్రాంతానికి చెందిన ఓ సైనికుడి మృతి చెందాడు.

9.పుతిన్ ను సమావేశానికి ఆహ్వానించిన ఉక్రెయిన్

రష్యా దాడి నుంచి ట్రైన్ కాపాడుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్ స్కి సమావేశానికి ఆహ్వానించారు.

10.భారత్ చైనా సంబంధాలు పరిస్థితుల్లోనే ఉన్నాయి

భారత్-చైనా మధ్య సంబంధాలు ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాయి అని ,భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు