నెంబర్ 4లోకి వెళ్లనున్న ఈటీవీ.. జబర్దస్త్, ఢీ రేటింగ్స్ పడిపోవడంతో?

1990 లో శాటిలైట్ ఛానల్స్ హవా మొదలైంది.అయితే అంతకు ముందు వరకు కూడా దూరదర్శన్ మాత్రమే తెలుగు ప్రేక్షకులు చూస్తూ ఉండేవారు.

 Telugu Entertainment Channel Etv Rating Going Down Details, Telugu Entertainment, Etv, Etv Rating, Tollywood, Etv Channel Rating Down, Star Maa, Dhee Show, Jabardasth Show, Swarabhi Sekham, Gemini Tv, Serials, Cash Program-TeluguStop.com

ఆ తర్వాత ఎప్పుడూ అయితే ఎంటర్టెన్మెంట్ రంగంలోకి శాటిలైట్ ఛానల్స్ వచ్చాయో ఆ తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి.ఆ సమయంలోనే తెలుగులో జెమిని టీవీ మరియు ఈ టీవీలు బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయడం మొదలు పెట్టాయి.

సరిగ్గా చెప్పాలంటే 1995 లో ఈటీవీ ప్రారంభం అయ్యింది.ఆ సమయంలో పోటీ అస్సలు లేదు.

 Telugu Entertainment Channel Etv Rating Going Down Details, Telugu Entertainment, Etv, Etv Rating, Tollywood, Etv Channel Rating Down, Star Maa, Dhee Show, Jabardasth Show, Swarabhi Sekham, Gemini Tv, Serials, Cash Program-నెంబర్ 4లోకి వెళ్లనున్న ఈటీవీ.. జబర్దస్త్, ఢీ రేటింగ్స్ పడిపోవడంతో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో ఆ టీవీలో ఏది వస్తే అది చూసేవారు.ఆ సమయంలో ఏం చూపిస్తే అదే జనాలు ఎంజాయ్‌ చేసేవారు.కాని పోటీ పెరుగుతూ రావడంతో టీవీ చానల్స్ కూడా కంటెంట్ క్వాలిటీ పెంచుతూ వచ్చాయి.1995 లో జెమిని టీవీ మరియు ఈటీవీ లు కాస్త గ్యాప్‌ తో ప్రారంభం అయ్యాయి.

దాదాపు పది సంవత్సరాల పాటు ఈ రెండు ఛానల్స్ కు పోటీ అనేది లేదు.ఆ సమయంలో ఈటీవీ నెం.1 స్థానంలో ఉండేది.2002 లో మా టీవీ, 2005 సంవత్సరం లో జీ తెలుగు ఛానల్స్ ప్రారంభం అవ్వడంతో ఈటీవీ మరియు జెమిని టీవీలకు పోటీ మొదలు అయ్యింది.మరో వైపు న్యూస్ ఛానల్స్ మొదలు అయ్యాయి.మొత్తంగా వందల కొద్ది తెలుగు ఛానల్స్ మొదలు అయ్యాయి.అయినా కూడా ఈటీవీ టాప్‌ లోనే కొనసాగుతూ వచ్చింది.కాని ఎప్పుడైతే సీరియల్స్ విషయంలో పట్టు కోల్పోయారో అప్పుడు రేటింగ్ తగ్గుతూ వచ్చింది.

సీరియల్స్ లేక పోయినా కూడా ప్రైమ్‌ టైమ్‌ లో వచ్చిన జబర్దస్త్‌, ఢీ, క్యాష్‌, పాడుతా తీయగా, స్వరాభిషేకం ఇంకా కొన్ని కార్యక్రమాలతో ఈటీవీ టాప్‌ లోనే కొనసాగేలా చేసింది.

Telugu Cash Program, Dhee Show, Etv Channel, Etv, Gemini Tv, Jabardasth Show, Serials, Maa, Swarabhi Sekham, Telugu, Tollywood-Latest News - Telugu

సీరియల్స్ తో స్టార్‌ మా నెం.1 కు దూసుకు వచ్చినా ఈటీవీ మాత్రం నెం.2 స్థానం లో నిలిచింది.ఇప్పుడు జబర్ధస్త్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోవడంతో పాటూ ఢీ షోని కూడా చాలా తక్కువ మంది చూస్తుండడంతో ఇక సీరియల్స్ విషయం సరేసరి.ఇలాంటి సమయంలో ఈటీవీ రేటింగ్‌ నెం.4 కు పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది.జబర్దస్త్‌ మరియు ఢీ షో లను చేజేతుల ఈటీవీ వారు నాశనం చేస్తున్నారు.నెం.4 కు వెళ్లాలని చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా ఉంది అని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube