బ్రిటన్ : తెలుగు చిన్నారి ప్రతిభకు రెడ్ కార్పెట్ వేసిన ప్రఖ్యాత స్కూల్

ది రాయల్ బ్యాలే స్కూల్ లండన్ లో ఉన్న ఈ ప్రఖ్యాత స్కూల్ లో సాంప్రదాయ బ్యాలేను నేర్పుతారు.ఈ స్కూల్ లో చేరడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

 Telugu Child Extraordinary Talent Got Seat In A Famous School In Britain , Telu-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఈ స్కూల్ లో చేరేందుకు పోటీలు పడుతుంటారు.ఈ స్కూల్ లో తరగతుల వారీగా సీట్లు ఉంటాయి.7వ తరగతిలో కేవలం 12 మందికి మాత్రమే చేరే అవకాశం ఉంటుంది.పైగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పోటీపడటంతో ఈ స్కూల్ లో సీటు వస్తుందా లేదా అనే ఆందోళన తల్లి తండ్రులలో ఉంటుంది.

అలాంటి స్కూల్ లో వేలాది మందిని దాటుకుంటూ సీటు సాధించింది మన తెలుగు చిన్నారి యడ్ల అనీషా.

అనీషా తల్లి తండ్రులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం విశేషం.

తండ్రి విజయవాడ వాసి కాగా, తల్లి హైదరాబాద్ వాసి దాదాపు 17 ఏళ్ళ క్రితమే వారు లండన్ కు వలస వెళ్ళారు.దేశం కాని దేశం వెళ్ళినా తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తూ తమ కూతురిని తీర్చి దిద్దారు.

అనీషాలో ప్రత్యేకమైన ప్రతిభ దాగుందని గుర్తించిన తల్లి తండ్రులు అనీషా కు చిన్న తనం నుంచే డ్యాన్స్ నేర్పించారు.సాంప్రదాయ బ్యాలే డ్యాన్స్ లో నిపుణురాలు కావాలనే తపనతో రెండేళ్ళుగా అనీష కు ప్రత్యేక తర్ఫీదు ఇప్పించారు.

కేవలం ఈ స్కూల్ లో సీటు కోసం ఆమె రెండేళ్ళుగా సాధన చేస్తూనే ఉందని తల్లి తండ్రులు తెలిపారు.

ఇదిలాఉంటే ప్రఖ్యాత స్కూల్ లో అవకాశం దక్కడంతో అనీషా సంతోషానికి అవధులు లేవు.

భారతీయులకు కూడా ఈ కళలో అవకాశాలు ఉండాలని భావించానని ఎట్టకేలకు తన కలను నేరవేర్చుకున్నానని అనీష తెలిపింది.కాగా ఈ స్కూల్ లో సీటు సాధించిన విద్యార్ధుల ఖర్చులు యాజమాన్యమే భరిస్తుంది.

ఈ స్కూల్ లో శిక్షణ తీసుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా మంచి అవకాశాలు అందుతాయని ఇది ఎంతో ప్రత్యేకమైన కళని, ,చిన్న వయసులో రాయల్ బ్యాలే స్కూల్ లో అనీష సీటు సాధించడం ఎంతో గొప్ప విషయమని స్థానిక తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube