ఒక్కోసారి కొంతమంది నటనపై ఉన్నటువంటి మక్కువతో తాము చేస్తున్నటువంటి పనులు, ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి ఎలాగైనా ఒక్క ఛాన్స్ దక్కించుకుని తమ నటనా ప్రతిభను నిరూపించుకుని ప్రస్తుతం స్టార్ డమ్ ని అనుభవిస్తున్నారు.అలాగే మరికొంతమంది సినిమా అవకాశాలను దక్కించుకోలేక ఇటు నటనను వదులుకోలేక ఏదో చప్పగా రాణిస్తున్నారు.
అయితే పలు బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “శ్రీ సుధా రెడ్డి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సినఅవసరం లేదు.అయితే ఈమె ఓ ప్రముఖ యూనివర్సిటీలో వైద్య శాస్త్రానికి సంబంధించిన చదువుని పూర్తి చేసింది.
అంతేగాక కొంత కాలం పాటు వైద్య రంగంలో ఉద్యోగం కూడా చేసిందే.
కానీ అనుకోకుండా సినిమాలపై మనసు మళ్లడంతో ఉన్నఫలంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి నటి అవ్వాలని సినిమా పరిశ్రమకు వచ్చింది.
అయితే ఈ అమ్మడికి హీరోయిన్ కి కావలసినటువంటి అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఆమె తాను నటించిన చిత్రాలలోని పాత్రల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో హీరోయిన్ కాలేకపోయింది. దీనికితోడు ఇప్పటివరకు సుధా రెడ్డి నటించిన చిత్రాలలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరు గుర్తించలేదు.
అంతేగాక తన నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని కూడా దక్కించుకోలేక పోయింది.

దీంతో హీరోయిన్ కావాలని సినిమా పరిశ్రమకు వచ్చినటువంటి నటి సుధా రెడ్డి కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైంది.అయితే ఆ మధ్య టాలీవుడ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ సినిమాటో గ్రాఫర్ శ్యామ్ కె నాయుడు తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సహజీవనం కూడా చేసి చివరికి పెళ్లి విషయం ఎత్తితే మొహం చాటేస్తున్నాడని కాబట్టి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేసింది.దీంతో పోలీసులు శ్యామ్ కె నాయుడు పై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి శ్రీ సుధా రెడ్డి తెలుగులో దాదాపుగా 50 కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు రవి బాబు దర్శకత్వం వహిస్తున్న “క్రష్” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి.
దీంతో ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.