బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్ కోసం వారి ఎదురు చూపులు.. అది క్లారిటీ వస్తే మొదలు

బిగ్‌ బాస్ సీజన్ 7 అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.స్టార్ మా వారు మరియు బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే అందుకు సంబంధించిన హడావుడి మొదలు పెట్టి ఉండాల్సింది.

 Telugu Biggboss Season 7 Update After Host Final , Telugu Biggboss Season 7, Bal-TeluguStop.com

కానీ నాగార్జున హోస్ట్ గా చేసేందుకు నిరాకరించడంతో బిగ్ బాస్ వారు కొత్త హోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి ముందు హోస్ట్ విషయం లో ఒక నిర్ణయానికి రావాలని వారు భావిస్తున్నారట.

గత ఎడాది ఈ సమయానికి ఓటిటి బిగ్ బాస్ రన్ అవుతుంది.కానీ ఈ సారి మెయిన్ బిగ్ బాస్ కి కూడా దిక్కు లేకుండా పోయింది అంటూ ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు హిందీ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వరుసగా సీజన్లు కొనసాగుతూనే ఉన్నాయి.కానీ తెలుగు బిగ్ బాస్ కి మాత్రం ఏదో ఒక అడ్డు తలుగుతూ వస్తోంది.

పెద్ద ఎత్తున బిగ్ బాస్ ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి పరిస్థితి అవసరమా అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu Balakrishna, Biggboss, Nagarjuna, Rana, Maa, Telugu Biggboss-Movie

కొత్త హోస్ట్ ఎవరు అనే విషయం లో ఇంకా క్లారిటీ రాలేదు.కానీ బాలకృష్ణ నుండి మొదలుకొని రానా, నాని ఇలా ఎన్నో పేర్లు కూడా వినిపిస్తున్నాయి.విజయ్ దేవరకొండ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి హోస్టింగ్ చేయించాలని నిర్వాహకులు భావిస్తున్నారట.

కానీ విజయ్ దేవరకొండ నుండి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.ఇప్పటికే ఆయనతో ఫలు దపాలుగా చర్చించారని, ఆయన నుండి సరైన స్పందన రావడం లేదని తెలుస్తుంది.

బాలకృష్ణ కూడా బిగ్బాస్ హోస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది.నిజంగానే నిర్వాహకులు ఆయనను సంప్రదించారట.

కానీ బాలకృష్ణ కూడా ఆసక్తి కనబరచలేదు అంటూ సమాచారం అందుతుంది.మొత్తానికి బిగ్ బాస్ కొత్త సీజన్ అప్డేట్ రావాలి అంటే హోస్ట్ విషయం లో ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

షో నిర్వాహకులు హోస్ట్‌ తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే బిగ్ బాస్ యొక్క కొత్త సీజన్ ను గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube