తెలుగు బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) నుంచి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అమ్మాయే అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.మధ్య లో గౌతమ్ ఎలిమినేట్ అయినట్లుగా చెప్పినా కూడా ఆయన్ను సీక్రెట్ రూం లో ఉంచడం జరిగింది.
సీక్రెట్ రూమ్ నుంచి గౌతమ్ వచ్చేశాడు.మొదటి నుంచి కూడా అమ్మాయిలు మాత్రమే ఎలిమినేట్ అవ్వడం తో ఈ వారం లో కూడా అదే సెంటిమెంట్ పునరావృతం అవ్వబోతుందనే టాక్ వినిపిస్తుంది.
ఈ వారం లో ఫోటోలు తగులబెట్టి నామినేషన్ చేయడం జరిగింది.ఈ వారం లో గౌతమ్, శోభ, అశ్విని, శివాజీ, ప్రియాంక, అమర్ దీప్, సందీప్ ( Gautham, Shobha, Ashwini, Shivaji, Priyanka, Amardeep, Sandeep )మరియు భోలే లు ఉన్నారు.
ఇప్పటి వరకు సందీప్ నామినేషన్ లోకి రాలేదు.మొదటి సారి నామినేట్ అవ్వడం వల్ల ఆయన కి ఎక్కువ డేంజర్ ఉన్నట్లుగా అంటున్నారు.
అయితే ఆడ వారికే ఎక్కువ ఎలిమినేట్ స్కోప్ ఉంటుంది.కనుక శోభ ను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ఓవర్ యాక్షన్ ను చాలా మంది విమర్శిస్తున్నారు.

ఆమె తప్పితే సందీప్ కి ఎలిమినేట్ ఛాన్స్ ఎక్కువ ఉంది అన్నట్లుగా కూడా బిగ్ బాస్ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.అంతే కాకుండా కొందరు ఆఫ్ ది రికార్డ్ ఓటింగ్ నిర్వహించగా కింది స్థానం లో శోభ ఉండగా ఆ తర్వాత స్థానం లో సందీప్ ఉన్నాడు.ప్రియాంక మరియు గౌతమ్ లు కూడా చాలా తక్కువ ఓట్ల తో డేంజర్ జోన్ లో ఉన్నారు.
ఈ వారం ఎలిమినేట్ అయిన వారిలో అశ్విని కూడా ఉంది.అయితే ఆమె ఎలిమినేట్ అయ్యే ఖాన్స్ లేనే లేదు అంటున్నారు.కనుక శోభ కి 99 శాతం మూడినట్లే అంటున్నారు.మరి కొన్ని గంటల్లో ఓటింగ్ లైన్లు ముగుస్తాయి.
కనుక కచ్చితంగా శోభ కి డేంజర్ తప్పదు అంటున్నారు.ఆమె సేఫ్ అయితే ప్రియాంక కి డేంజర్ తప్పదేమో అంటున్నారు.