ఈ యాంకర్ అలాంటి పని చేయడంతో కేసు పెట్టారు... చివరికి..

తెలుగు బుల్లితెరపై తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ "టాలీవుడ్ యాంకర్ ప్రశాంతి" గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే యాంకర్ ప్రశాంతి ఆ మధ్య తమిళ దర్శకుడు శ్రీ రాజన్ దర్శకత్వం వహించిన "ఎఫైర్" అనే చిత్రంలో కూడా స్వలింగ సంపర్కురాలి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.

కానీ అనుకోకుండా ఆమె జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన కారణంగా యాంకర్ ప్రశాంతి సినీ జీవితం కొంతమేర చతికిలపడింది.అయితే ఆ మధ్య ఈ అమ్మడు హైదరాబాదులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మద్యం సేవించి స్టేడియంకి వచ్చి నానా హంగామా చేసింది.

Telugu Anchor Prasanthi Cine Career News, Prasanthi, Telugu Anchor And Actress,

దీంతో ఇది గమనించిన కొందరు ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.అంతేగాక ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్నటువంటి ఓ వ్యక్తి నటి ప్రశాంతిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

దీంతో పబ్లిక్ న్యూసెన్స్ విషయమై పలు సెక్షన్ల కింద పోలీసులు ఈ అమ్మడి పై కేసు నమోదు చేశారు.దీంతో అప్పట్లో ఈ విషయం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది.

Advertisement

అయితే సెలబ్రెటీల విషయంలో ఇది సర్వసాధారణమయినప్పటికీ ఈ విషయం మాత్రం ప్రశాంతి సినీ కెరియర్ పై బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.అప్పటి వరకు పలు ఈవెంట్లు, షోలు, తదితర వాటితో బిజీగా గడుపుతున్న ప్రశాంతి కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయింది.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ప్రశాంతి తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన స్టార్ మా లో ప్రసారమయ్యే "ఇంటింటి గృహలక్ష్మి" ధారావాహికలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది.

కాగా ఈ ధారావాహికలో మెయిన్ లీడ్ పాత్రలో అన్నమయ్య మూవీ ఫేమ్ వెటరన్ హీరోయిన్ కస్తూరి శంకర్ నటిస్తోంది.అయితే ఈ అమ్మడు తెలుగులో ఎఫైర్, అనగనగా అలా జరిగింది, అనే రెండు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.

కానీ ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడికి ఎలాంటి గుర్తింపు లభించలేదు.దీంతో ప్రస్తుతం సీరియళ్లపై దృష్టి సారిస్తోంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు