దేవుడి కన్నా ఆ ఫార్ములానే గొప్పదంటున్న తెలుగు నటుడు....  

తెలుగులో పలు టాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణస్వామి శ్రీకాంత్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ మధ్య కాలంలో కృష్ణస్వామి శ్రీకాంత్ ఎక్కువగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తున్నాడు.

 కాగా తాజాగా కృష్ణస్వామి శ్రీకాంత్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇందులో భాగంగా మొదట తనకు దేవుడు అనే కాన్సెప్ట్  అంటే ఏంటో ఇప్పటివరకు అస్సలు అర్థం కాలేదని అందువల్లనే తాను ఎప్పుడూ కూడా దేవుడిని తలుచుకోలేదని తెలిపాడు.

దీంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ అవాక్కయింది.ఆ తర్వాత చిన్నప్పుడు మీరు (A+B)^2 ఫార్ములాని చదివి ఉంటే ఆ ఫార్ములా దేవుడి కంటే చాలా గొప్పదని కావాలంటే తను నిరూపిస్తానని కూడా చెప్పుకొచ్చాడు.

ఇక తనకి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎంతో అభిమానమని అతడిలా కనీసం ఒక్క రోజైనా బ్రతకాలని ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.అంతేకాక రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కూడా ఎవరినీ వృత్తిపరంగా కించపరచడం కానీ లేదా తక్కువ చేసి మాట్లాడటం తాను ఇప్పటివరకు చూడలేదని తెలిపాడు.

Advertisement

అంతేగాక తనతో పాటు పనిచేసే వారిని రామ్ గోపాల్ వర్మ ఎంతో గౌరవిస్తాడని, అలాగే చాలా ముక్కుసూటి తత్వంగా ఉంటాడని, మనసులో ఒకటి  ఉంచుకొని బయటికి మరో విధంగా మాట్లాడడని ఆ విషయం తనకి బాగా నచ్చుతుందని  తెలిపాడు.ఇక అతడి వ్యక్తిగత అలవాట్ల విషయానికొస్తే ప్రపంచంలోని మానవాళిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క జీవన శైలి ఉంటుందని అలాంటప్పుడు ఇతరులు జీవనశైలిపై మనం కామెంట్ చేయకూడదని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే కృష్ణస్వామి శ్రీకాంత్ తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన "మర్డర్" చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

 కాగా ప్రస్తుతంకృష్ణస్వామి శ్రీకాంత్ తెలుగు హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన "గాలి సంపత్" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు