వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ బాక్సులు బద్దలవ్వాలని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తెలిపారు.కరీంనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన ధర్మం కోసమే బీజేపీ పని చేస్తుందని పేర్కొన్నారు.
బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.ప్రజల కోసం పోరాడితే దొంగ కేసులు పెట్టి తనను జైలుకు పంపించారని మండిపడ్డారు.
కరీంనగర్ లో కాషాయజెండాకు తప్ప మరో పార్టీ జెండాకు చోటు లేదని చెప్పారు.బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు.