తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది.కొద్ది రోజుల క్రితం మంత్రి శ్రీనివాస్ గౌడ్( V Srinivas Goud ) వెంట తిరుమలకు వెళ్లిన మనోహర్ ఎన్నిక నిబంధనలు ఉల్లంఘించారని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది.
కోడ్ అమలులో ఉండగా.ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించడం జరిగింది.
ఇదే సమయంలో టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ఓఎస్డి సత్యనారాయణరావును విధులనుంచి ఈసీ తొలగించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
ఈనెల 30వ తారీఖు ఎన్నికలు జరగనున్నాయి.డిసెంబర్ మూడవ తారీకు ఫలితాలు రానున్నాయి.
ఈ క్రమంలో ఈసీ కట్టు దిట్టంగా వ్యవహరిస్తూ ఉంది.ఇదే సమయంలో తెలంగాణలో భారీగా నగదు మరియు బంగారం పోలీసులకు పట్టుబడుతూ ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మంత్రితో టూరిజం ఎండి మనోహర్ వెళ్లడంతో వివరణ తీసుకున్న అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్( Election Commission ) వేటు వేసింది.ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ చర్య తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.