తెలంగాణాలో మహాకూటమిలో చేరడమే కాకుండా… టీడీపీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు పెద్ద తప్పే చేసినట్టు అంతా చర్చించుకుంటున్నారు.అసలు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరూ ఊహించలేదు.
పొత్తు పెట్టుకోక ముందు కాంగ్రెస్ పేరు చెబితే చాలు బాబు ఒంటికాలిపై లేచేవాడు.అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి అసలు కారణం ఆ పార్టీనే అంటూ మండిపడే వాడు.
కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ తో బాబు జత కట్టాల్సి వచ్చింది.దీనిపై ఏపీ తెలంగాణల్లో టీడీపీ ప్రత్యర్థి పార్టీలు కూడా అనేక అనేక విమర్శలు చేశాయి.
బాబు పచ్చి అవకాశవాది అని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం విమర్శించాడు.

అంతే కాదు… కాంగ్రెస్ తో జత కట్టడం ద్వారా… తన అవకాశవాదాన్ని చంద్రబాబు నాయుడు పరిపూర్ణంగా చూపించేశాడని కేటీఆర్ అంటున్నాడు.పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబుకు మరెవరూ మిగల్లేదని.ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే మిగిలిందని కేటీఆర్ బాబు ని ఎటకారం కూడా చేసాడు.
ఈ విషయాలన్నీ పక్కనపెడితే… తెలంగాణ టీడీపీ అవ్యర్థులు ఇప్పడు దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో తో ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పలువురు తెలుగుదేశం నేతలు వైఎస్ఆర్ బొమ్మను వాడేసుకుంటున్నారు.
టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో.వారి జెండాల్లో వైఎస్ బొమ్మ పెద్దగానే కనిపిస్తోంది.
ఏఈ పరిణామాళ్లు టీడీపీ అధినేతకు రుచించకపోయినా ప్రస్తూత పొత్తుల కారణంగా మౌనంగా బాబుకి భరిస్తూన్నాడు.

ఆఖరికి వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడుక్కోవాల్సిన స్థితికి వచ్చింది తెలుగుదేశం పార్టీ.ఒకవైపు వైఎస్ పై అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వాడు.ఆయన చనిపోయాక కూడా ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను విమర్శిస్తూ … బాబు రాజకీయం చేసాడు.అయితే…ఇప్పుడు మాత్రం ఏపీ తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు ఖాయం అయిపోవడంతో … రాజశేఖర రెడ్డి ఫోటో టీడీపీ ఫ్లెక్సీలలో కనిపిస్తూన్నా … పల్లెత్తు మాట అనలేని పరిస్థితికి బాబు వచ్చేసాడు.తెలంగాణలో ఈ పరిణామాలు అంత ప్రభావం చూపించకపోయినా… ఏపీ విషయానికి వస్తే … బాబు కి మాత్రం ఇది చికాకు కలిగించే అంశమే.
దీన్ని వైసీపీ రాజకీయంగా కూడా వాడేసుకునే అవకాశం లేకపోలేదు.







