వరాలు ఇచ్చినా పలం ధక్కదా ?

Telangana People Will Not Believe Modi , Prime Minister Narendra Modi, Sammakka Sarakka Tribal University, Bihar, Telangana , BJP , Politics

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) తెలంగాణ పర్యటన తో తెలంగాణ పై వరాల జల్లు కురిసింది.చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గిరిజన యూనివర్సిటీతో పాటు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ( Sammakka Sarakka Tribal University )పేరుతో 900 కోట్లతో ములుగు జిల్లాలో వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన మోడీ, మెహబూబ్ నగర్ లో జాతీయ రహదారులు, రైల్వే తదితరుల శాఖలకు సంబంధించిన డెవలప్మెంట్లు ఇలా అనేక వరాలను ప్రకటించారు.

 Telangana People Will Not Believe Modi , Prime Minister Narendra Modi, Sammakka-TeluguStop.com

అంతేకాకుండా గత ఎన్నికలలో హామీ ఇచ్చిన పసుపు బోర్డును కూడా మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.హఠాత్తుగా మోడీకి తెలంగాణపై ఈ స్థాయి ప్రేమ ఎందుకు అంటే ఎన్నికల కోసమే అంటున్నాయి ప్రతిపక్షాలు.

ఎన్నికల ఎన్నికలు వచ్చే ప్రతి రాష్ట్రంపై మోడీకి అకస్మాత్తుగా ప్రేమ పెరుగుతుందని అది ఆచరణలో కనిపించదు అంటూ విపక్షాలు సెటైర్లు పేలుతున్నాయి.

Telugu Bihar, Primenarendra, Sammakkasarakka, Telangana-Telugu Political News

ఒకప్పుడు బీహార్( Bihar ) కి కూడా ఇలానే లక్షల కోట్ల రూపాయల హామీలు ఇచ్చారని కానీ ఆచరణలో మాత్రం మొండి చేసి చూపించారని ఇది మోడీకి బాగా అలవాటు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.అయినా తెలంగాణలో గత కొంతకాలం కితం వరకు అధికారం పై ఎంతో కొంత ఆశ వున్న దశలో ఇలాంటి వరాలు ఇచ్చి ఉండుంటే కచ్చితంగా తెలంగాణలో గణనీయమైన పాత్ర భాజపా పోషించి ఉండేది అన్నది విశ్లేషకుల మాట .అనేక వ్యతిరేక పరిణామాల తర్వాత దాదాపు తెలంగాణలో ఎన్నికల పోరు బారాసా vs కాంగ్రెస్ గా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్నికల లక్ష్యం గా ఎన్ని హామీలు ఇచ్చినా అవి నిష్ప్రయోజనమే అంటూ రాజకీయ విశ్లేషకులు వాఖ్యనిస్తున్నారు .అయితే మోడీ దేశ ప్రధానిగా తన బాధ్యత గా తెలంగాణపై( Telangana ) అభివృద్ధిపై కార్యక్రమాలను ప్రకటించారు తప్ప ఎన్నికలతో సంబంధం లేదంటూ కమలనాధులు సమర్ధించుకుంటున్నారు, ఏది ఏమైనా తన అనాలోచిత నిర్ణయాలను తెలంగాణలో తన పుట్టి తానే ముంచుకున్న భాజపా ఎన్ని వారాలు ప్రకటించినా అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం గానే ఉంటుందని , వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం పెద్దగా ప్రయోజనం ప్రభావం చూపించడం కష్టమే అంటూ విశ్లేషణలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube