తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మార్చిలో ఎన్నికలు జరగవచ్చని స్పష్టం చేశారు.
పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు అమిత్ షానే ఇన్చార్జిగా వ్యవహరిస్తారు.ఒక్కో అగ్ర నేత ఒక రాష్ట్రాన్ని పర్యవేక్షిస్తారు.
ఇదిలావుండగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో( Parliament Elections ) పోటీ చేసేందుకు పార్టీ తరఫున.ఆశావాహుల నుంచి దరఖాస్తులు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
మోదీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్ ఎన్నికల కోసం ఎదురుచూస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ క్రమంలో డిసెంబర్ 28న రంగారెడ్డి జిల్లా కొంగర సమీపంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఈనెల 28వ తారీకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) తెలంగాణ పర్యటన ఖరారు అయింది.ఈ పర్యటనలో రాష్ట్ర బీజేపీ నేతలతో( BJP Leaders ) సమావేశమయ్యి పార్లమెంట్ ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
నెల రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలు కావటం తెలిసిందే.దీంతో వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.