ఏపీ బాట‌లో తెలంగాణ‌.. రివేంజ్ పాలిటిక్స్ షురూ..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏళ్లుగా కొట్లాడిన కానీ ఇక్కడ ప్రతీకార రాజకీయాలు మాత్రం లేవు.ప్రతీకార రాజకీయాలకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పెట్టింది.

పేరు.అక్కడ ప్రతీకార రాజకీయాలు ఏ విధంగా ఉంటాయాంటే చూసే వారు సైతం ముక్కున వేలేసుకుని అమ్మా అని అంటారు.

అటువంటిది నెమ్మదిగా తెలంగాణలో కూడా ప్రతీకార రాజకీయాలకు భీజం పడుతున్నట్లుగా కనిపిస్తోంది.ఆ ప్రతీకార రాజకీయాలకు ఆజ్యం పోస్తుంది టీఆర్ఎస్ బాస్ కేసీఆరే అని చెప్పొచ్చు.

తన మాట వినకపోతే ఎంతటి వారినైనా సరే వెనుకాడకుండా ఆయన అణగదొక్కుతున్నారు.అసలు నిరసనే చేయకుండా హౌజ్ అరెస్టులు చేయిస్తున్నారు.

Advertisement
Telangana On AP Path Revenge Politics Started Details, Ts Politics, Sanjay, Band

అయినా కానీ బయటకు వచ్చి నిరసనలు చేస్తే పోలీసులతోని కేసులు పెట్టించి లోపలేయిస్తున్నారు.ఇందుకు ఆదివారం రోజు కరీంనగర్ లో జరిగిన బండి సంజయ్ అరెస్టే ఉదాహరణగా చెప్పొచ్చు.

ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేఖంగా దీక్ష చేస్తున్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.అంతటితో ఆగకుండా కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టి రిమాండ్ కు కూడా పంపారు.

కొద్ది రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారంటూ లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.తన ఇంటిలోనికి పోలీసులు వెనుక నుంచి ప్రవేశించారని ఆయన ఆరోపించారు.

ఉద్యమం రోజుల్లో ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా మారి వ్యవహరిస్తోంది.

Telangana On Ap Path Revenge Politics Started Details, Ts Politics, Sanjay, Band
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

కేసీఆర్ ఇలా వ్యవహరిస్తుండడం ఇక్కడి ప్రజలకు కూడా నచ్చట్లేదు.వారు ఆయన మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.తన మాట వినని నాయకులను కేసీఆర్ ఎలాగైనా సరే అణచి వేయాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అన్యాయంగా అరెస్టు చేసిన కేసీఆర్ కు త్వరలోనే అంతకంత చేసి చూపిస్తామని బీజేపీ అంటోంది.మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.

ప్రతీకార రాజకీయాలు ఇక్కడ కూడా మొదలు కాబోతున్నాయనే సంకేతాలు ఈ విషయాలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది.

తాజా వార్తలు