వైభవోపేతంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు..

సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా దినం సమిష్టిగా అందరూ ఉత్సవాల్లో పాల్గొని మనమంతా భారతీయులం అనే జాతీయ స్ఫూర్తిని చాటాలి.18న నిర్వహించే వజ్రోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత విశిష్టతను చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా, వైభవోపేతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పిలుపునిచ్చారు.ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా 18వ తేదీ సాయంత్రం సర్దార్ పటేల్ స్టేడియం నందు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుండి 9గంటల వరకు నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాల వాల్ పోస్టర్ ను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో వాల్ పాస్టర్ ను మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారితో కలసి మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.

 Telangana National Unity Diamond Festival , Telangana National Unity , Minister-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ.ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మూడు రోజులపాటు పండగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను అదేశించారు.

తెలంగాణ ప్రాధాన్యతను చాటేలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినందున, ప్రతి అంశాన్ని ప్రాముఖ్యమైనదిగా భావిస్తూ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం ఆశించిన దానికంటే మరింత విస్తృత స్థాయిలో నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించి వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఉద్బోధించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఉత్సవాల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్ల పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం సిద్దించగా, తెలంగాణ ప్రాంతం మాత్రం 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందన్నారు.ఇది జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా పెద్ద ఎత్తున తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.

ఏడాది పొడుగునా ఈ ఉత్సవాలు కొనసాగనుండగా, సెప్టెంబర్ 16 , 17 ,18 తేదీలలో వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా, వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.16వ తేదీన అన్ని శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించిన మీదట, బహిరంగ సభలో వజ్రోత్సవాల ప్రాధాన్యతను, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత గురించి వక్తలు వివరిస్తారని అన్నారు.17వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం జరుగుతుందన్నారు.పంద్రాగస్టు తరహాలోనే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు పాల్గొని ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తానని వివరించారు.18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్ర్య సమరయోధులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర విశిష్టతను, స్ఫూర్తిని చాటిచెప్పాలని మంత్రి మంత్రి పువ్వాడ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube