డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.గ్రాడ్యుయేట్ అర్హతగా తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.ఈ మేరకు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.పూర్తి సమాచారం కోసం https://tshc.gov.in సంప్రదించాలని అధికారులు తెలిపారు.







