తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.చెప్పిందే చేస్తాం.
చేసేదే చెప్తామనేది తమ నినాదమని తెలిపారు.
తెలంగాణలో ప్రజలు నిశ్శబ్ద విప్లవంలా బీజేపీకి మద్ధతు పలకబోతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
అన్ని వర్గాలకు అవసరమైన న్యాయాన్ని చేసే విధంగా తమ ఎన్నికల ప్రణాళిక రూపొందిందని పేర్కొన్నారు.తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తుందన్న ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు అవినీతి లేకుండా పరిపాలన అందించడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలోనూ, బీఆర్ఎస్ పాలనతో అంతా అవినీతే ఉందన్నారు.తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిని పెంచి పోషించడమే కాకుండా రాష్ట్రాన్ని దోచుకున్నారు.ఈ క్రమంలోనే ప్రజలే సమర్థవంతమైన, నీతిగా నడిచే పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.