తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ తమిళిసై మరోసారి వివరణ కోరారు.
అయితే, ఈనెల 9న రాజ్ భవన్ వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు ఈ బిల్లుపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.గవర్నర్ అనుమానాలు నివృత్తి చేసి వారం రోజులు గడిచినా ఎటువంటి నిర్ణయాన్ని వెలువరించలేదు.
కాగా ఇప్పటికే గవర్నర్ వద్ద పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.ఈ క్రమంలో బిల్లులపై గవర్నర్ తమిళిసై కావాలనే తాత్సారం చేస్తుందని ప్రభుత్వం ఆరోపిస్తుంది.







