తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు.సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల సునీల్ కనుగోలుకు నోటీసులు జారీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈనెల 30న విచారణకు హాజరు కావాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా ఈ పిల్ పై తెలంగాణ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో సునీల్ కనుగోలుతో పాటు ఆయన బృందంపై 469, 505 సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.