తెలంగాణ రాష్ట్రం లో అధికార బీఆర్ఎస్ పార్టీ( BRS party ) దూకుడుగా దూసుకు పోతోంది.ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగబోతున్న విషయం తెలిసిందే.
అందుకోసం అధికార పార్టీ తీవ్రం గా ప్రయత్నాలు చేస్తుంది.మరో వైపు బిజెపి కూడా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది.
ఏకంగా అధికారాన్ని దక్కించుకునేందుకు బిజెపి జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఈ నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా వర్గ విభేదాల కారణంగా రోజు రోజు కు తగ్గిపోతుంది.
రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్( Congress ) పై అభిమానం కచ్చితంగా ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.కానీ ఆ అభిమానాన్ని రాష్ట్ర నాయకులు సద్వినియోగం చేసుకోవడం లేదు.
ఎవరికి వారు తానే ముఖ్యమంత్రి అభ్యర్థులను అంటూ ప్రకటించుకోవడం వల్ల పార్టీ పలచన అవుతుంది.

ఇటీవల నల్గొండ లో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ సభ వాయిదా వేయడం జరిగింది.అందుకు కారణం పార్టీ లో విభేదాలే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అధ్యక్షుడిగా ఉండడం పార్టీలోని సీనియర్ల కు చాలా మంది కి ఇష్టం లేదు అనే ప్రచారం జరుగుతుంది.
అందుకే వారు రేవంత్ రెడ్డి కి సహకరించడం లేదని కూడా వార్తలొస్తున్నాయి.ముఖ్యంగా ఇద్దరు ఎంపీ లు రేవంత్ రెడ్డి కి పెద్ద సమస్య గా మారారు అని వార్తలొస్తున్నాయి.
అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.మొత్తానికి ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( Congress party ) నాయకుల లొల్లి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.
ఈ లొల్లి ఇలాగే కంటిన్యూ అయితే ఈ సారి మూడవ స్థానానికి పరిమితం అవ్వాల్సి వస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.అధినాయకత్వం కూడా టీ కాంగ్రెస్ ని పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది.







