తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లిన ఆయన ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న చర్చ జోరుగా కొనసాగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.కాంగ్రెస్ అగ్రనాయకులతో సమావేశం కానున్న రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
దాంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించనున్నారని సమాచారం.అలాగే నిన్న గాంధీభవన్ లో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.