Cm Revanth Reddy : రేవంత్ ను రెచ్చగొట్టారు… ఇప్పుడు రియాక్షన్ చూస్తున్నారు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పూర్తిగా సైలెంట్ అయిపోయారు.సొంత పార్టీలో తనపై విమర్శలు చేసిన వారిని , అదేపనిగా తనపైనా.

 Telangana Cm Revanth Reddy On Brs Party-TeluguStop.com

తమ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల ను పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు.ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ఇంకా అమలు చేయలేకపోయారంటూ బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నా.

పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు.రాజకీయంగాను, వ్యక్తిగతంగాను తనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.

రేవంత్ సైలెంట్ గానే ముందుకు వెళుతూ వచ్చారు.అయితే దీని అంతటికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలవచ్చనే భయం రేవంత్ లో ఉందని, అందుకే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఆయనపై వచ్చాయి.

Telugu Aicc, Ap, Brs, Jagan, Pccc Hief, Revanth Reddy, Telangana Cm, Ts-Politics

తాజాగా ఆ తరహా విమర్శలకు చెక్ పెట్టే విధంగా రేవంత్ రెడ్డి తనపై విమర్శలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.గత రెండు, మూడు రోజులుగా రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.ఇంద్రవెల్లి( Indervelly ) లోక్ సభ ఎన్నికల ప్రచార బేరి సభలో ప్రభుత్వాన్ని పడగొడతామంటూ గతం నుంచి వ్యాఖ్యలు చేస్తున్న వారిపై రేవంత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.పండబెట్టి తొక్కుతామని, కట్టేసి కొడతామంటూ హెచ్చరికలు చేశారు.

ఇప్పటివరకు రేవంత్ సమన్వయంతో వ్యవహరిస్తూ వస్తుండగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే కామెంట్లు చేస్తుండడంతో రేవంత్ రెడ్డి ఎదురుదాడి మొదలుపెట్టారు .

Telugu Aicc, Ap, Brs, Jagan, Pccc Hief, Revanth Reddy, Telangana Cm, Ts-Politics

ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో తప్పంతా బీఆర్ఎస్ పార్టీ చేసి ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ రేవంత్ మండిపడ్డారు.కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.గతంలో కేసీఆర్( KCR ) చేసిన ఘాటు విమర్శల స్థాయిలోనే రేవంత్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు.

ప్రాజెక్టుల్ని అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని, దానికి సంబంధించిన సాక్షాలను బయటపెట్టారు.ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే సాగర్ ప్రాజెక్టు పైకి ఏపీ పోలీసులు వచ్చేలా కేసీఆర్ కుట్ర చేశారని, జగన్ రెడ్డి కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారని, చేయాల్సినంత చేసి కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సరికాదంటూ రేవంత్ మండపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube