వామ్మో కేసీఆర్ మామూలోడు కాదయ్యో

తాను అనుకున్నదే జరగాలని జరిగి తీరాలనే మనస్తత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉంది అనేది చాలామంది భావన.

ఆయన కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు.

కేసీఆర్ ముక్కుసూటిగా వెళ్లే మనిషి అని అందరికి తెలిసిందే.దానికి తగ్గట్టుగానే ఆయన వ్యవహారశైలి కూడా ఉంటుంది.

కేసీఆర్ చెప్పిందే వేదమని ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం తమకు లేదని మంత్రులు, ఎమ్యెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ ఉంటారు.తెలంగాణాలో ఉదృతంగా సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక్కసారిగా చల్లారిపోవడం వెనుక చాలా తతంగమే నడిచింది.ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని, అక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతారని అంతా భావించారు.

అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ అక్కడ విజయం సాధించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Advertisement

ఇక ఆ ధీమాతో కేసీఆర్ ఆర్టీసీ సమ్మె విషయంలో తన నిర్ణయమే ఫైనల్ అని ఈ విషయంలో ఎవరూ స్పందించవద్దని స్పష్టమైన ఆదేశాలు మంత్రులకు ఎమ్యెల్యేలకు ఇచ్చేసాడు.రోజు రోజుకు సమ్మె ఉదృతం అవుతున్న కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.చివరికి సమ్మెకు, తమ డిమాండ్లకు స్వస్తి చెప్పి దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ బతిమిలాడే పరిస్థితికి తీసుకొచ్చాడు కేసీఆర్.

దీంతో కేసీఆర్ లో ఉన్న మొండితనం, ధైర్య సాహసాలను అంతా మెచ్చుకున్నారు.కేసీఆర్ నిర్ణయం ఏదైనా మంత్రులు కానీ, ఎమ్యెల్యేలు కానీ ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఆ సందర్భంగా ఏంది ఆర్టీసీ కత ? క్షేత్రస్థాయిలో ప్రజాస్పందన ఎట్లుంది ? జనం ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్నారా ? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నరా ? అంటూ మంత్రులను కేసీఆర్ ప్రశ్నించగా ఏ ఒక్కరూ నోరు విప్పే ధైర్యం చేయలేకపోవరట.

ఏం మాట్లాడితే ఏ కొంప మునుగుతుందో అన్నట్టుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారట.రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కొత్తగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు ఈ విషయంలో పెద్దగా అవగాహన లేదు అనుకున్నా, కార్మికులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి వారి సమస్యలపై అవగాహన ఉన్న మంత్రి హరీష్ రావు సైతం సైలెంట్ గా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది.ఈ విషయంలో మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇదే బాటలో నడిచాడు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
ఆ దాడి ఘటనపై సీరియస్ .. నేడు కడపకు పవన్ కళ్యాణ్

మంత్రుల పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇక ఎమ్యెల్యేలు, కిందిస్థాయి నాయకుల పరిస్థితి చెప్పక్కర్లేదు.ఏమైనా కేసీఆర్ తెలంగాణలోనూ, పార్టీ, ప్రభుత్వంలోనూ ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తూ తన మాటకు ఎదురే లేకుండా చేసుకుంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు