నేడు తెలంగాణా క్యాబినెట్  భేటీ ! చర్చించే అంశాలు ఇవే ?

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ కాబోతోంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగబోయే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించబోతున్నారు.

 Telangana Government, Telangana, Kcr, Telangana Cm Kcr, Telangana Cabinet, Telan-TeluguStop.com

ప్రస్తుతం రాజకీయంగా తలెత్తుతున్న ఇబ్బందులు, కేంద్ర అధికార పార్టీ బిజెపి తెలంగాణ ప్రభుత్వం ని టార్గెట్ చేసుకుంటూ చేస్తున్న వ్యవహారాల పైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారట.అలాగే ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలతో పాటు,  అర్హులైన వారికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అంశాల పైన కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే స్థలం ఉండి సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించుకున్న నేపథ్యంలో , ఈ అంశం పైన క్యాబినెట్ లో చర్చించబోతున్నారట.

ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణ, పట్టాల పంపిణీ  వంటి వాటిని పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అవకాశం ఉన్నచోట్ల పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను గుర్తించడం, పట్టాల పంపిణీకి సంబంధించి ఈ మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.అలాగే గ్రామ కంఠంతో పాటు , ఇళ్ల స్థలాల ఎంపికలో ఏర్పడుతున్న ఇబ్బందులు తదితర సమస్యలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో దానిపైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. అలాగే దళిత బంధు పథకం అమలుపైన చర్చిస్తారు .

భూముల అమ్మకం ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి నిధుల సమీకరణ వంటి విషయాల పైన చర్చించబోతున్నారు.ఈ సందర్భంగా పార్టీ తరఫున ఎంపిక చేయాల్సిన ఇద్దరు నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లు కూడా కేసీఆర్ నేడు ఫైనల్ చేయబోతున్నారు.ఇక వీటితో పాటు,  తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడం పైన ప్రధానంగా చర్చించబోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube