తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు బడ్జెట్ కు సంబంధించి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు ఉభయ సభలు ప్రారంభంకానున్నాయి.ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే సభలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.అదే రోజు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.దాదాపు రూ.3 లక్షల కోట్లతో 2023-24 బడ్జెట్ కూర్పు ఉండనుంది.
అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సమాచారం అందించారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.కాగా ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.







