తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana assembly meetings )ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి.అయితే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎంపిక వ్యవహారంపై బీజేపీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
ఫ్లోర్ లీడర్ లేకుండానే గత అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ( BJP ) ఎమ్మెల్యేలు హాజరైన సంగతి తెలిసిందే.తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది.
కాగా బీజేపీ ఫ్లోర్ లీడర్ రేసులో రాజాసింగ్, ఏలేటి, పాయల్ శంకర్( Rajasingh, Eleti, Payal Shankar ) మరియు వెంకట రమణారెడ్డి ఉన్నారు.బీసీ కోటాలో రాజాసింగ్, పాయల్ శంకర్ శాసనసభా పక్ష నేత పదవిని ఆశిస్తున్నారని తెలుస్తోంది.వీరిలో రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ పదవినైనా బీసీకి ఇవ్వాలని పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.