షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..!

దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జోరుగా కొనసాగుతోంది.అయితే తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్టేనని తెలుస్తోంది.షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తో పాటే తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ కన్పిస్తుంది.అక్టోబర్ 6వ తేదీ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న ప్రచారం జోరందుకుంది.

మరోవైపు ఎన్నికల నిర్వహణకు కోసం కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.ఈ క్రమంలోనే అక్టోబర్ 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈసీ బృందం కీలక పర్యటన చేయనుంది.

Advertisement

ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ పార్టీ నేతలతో పాటు ఎన్నికల అధికారులతో ఈసీ బృందం సమావేశాలు నిర్వహించనుంది.అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీ బృందం నివేదిక అందించనుంది.

ఈ నివేదిక ఆధారంగానే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 తరువాత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు