విజయవాడ నేత కి తెలంగాణా పోలీసుల నోటీస్

విమానంలో పక్క సీట్లో కూర్చున్న మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్న టీడీపీ నేత, విజయవాడ 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు మెడకు ఉచ్చు బిగుస్తోంది.

 Telanagana Police Notices To Vijayawada Mp-TeluguStop.com

ఈ వ్యవహారంలో చంటిబాబుపై బాధితురాలు శంషాబాదు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చంటిబాబును విచారించేందుకే నిర్ణయించుకున్న శంషాబాదు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్న శంషాబాదు పోలీసులు చంటిబాబుకు స్వయంగా నోటీసులు అందజేశారు.

వారంలోగా హైదరాబాదు వచ్చి తమ ముందు విచారణకు హాజరుకావాలని సదరు నోటీసుల్లో ఆయనకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube