సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సినిమాలలో హనుమాన్( Hanuman movie ) బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా క్రేజ్ పరంగా పెద్ద సినిమా అనే సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాకు థియేటర్ల విషయంలో అన్యాయం జరుగుతోందని తెలుస్తోంది.
నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా హక్కులను తీసుకున్నా కేవలం 5 సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే ఈ సినిమా రిలీజ్ కానుందంటే ఈ సినిమాకు ఏ రేంజ్ లో అన్యాయం జరుగుతుందో అర్థమవుతోంది.వైజాగ్ ఏరియా( Visakhapatnam )లో ఈ సినిమాకు థియేటర్లు దొరకడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే హనుమాన్ మూవీ ఎన్నో ఇబ్బందులను అధిగమించగా మైత్రీ నిర్మాతలు సైతం ఈ సినిమా థియేటర్ల విషయంలో మొండిగా ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలుస్తోంది.రకరకాల ఈక్వేషన్ల వల్ల హనుమాన్ సినిమాకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హనుమాన్ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) సైతం ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.హనుమాన్ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.తేజ సజ్జా( Teja sajja ) కెరీర్ ను హనుమాన్ మూవీ డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే సినిమా అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ బాలయ్యకు స్టోరీ లైన్ చెప్పగా ఆ లైన్ ఓకే అయిందని తెలుస్తోంది.బాలయ్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాలో నటించనున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబో మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది.
చిన్న హీరో అని తేజ సజ్జాను తొక్కేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.