అహింస టైటిల్ తో ప్రేమకథ చేయబోతున్న అభిరామ్, తేజ

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.తేజ దర్శకత్వంలో అభిరామ్ తెరంగేట్రం చేయనున్నాడు.

 Teja And Abbiram Movie Titled Ahimsa, Tollywood, Krithi Sanon, Suresh Babu, Sure-TeluguStop.com

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాకుండా త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక తేజ తనకి భాగా అలవాటైన టీనేజ్ లవ్ స్టొరీనే ఈ మూవీ కోసం ఎంచుకున్నట్లు సమాచారం.ప్రేమకథలని తనదైన శైలిలో ఆవిష్కరించే తేజ అభిరామ్ కోసం మాత్రం కాస్తా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నట్లు సమాచారం.

కథలో కమర్షియల్ అంశాలు కూడా ఉండటంతో పాటు అతన్ని హీరోగా ఎలివేట్ చేయడానికి కావాల్సిన విధంగా స్క్రీన్ ప్లే సిద్ధం చేసి సురేష్ బాబుని మెప్పించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అహింస అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

Telugu Abbiram, Ahimsa, Krithi Sanon, Suresh Babu, Suresh, Teja, Tejaabbiram, To

అలాగే అభిరామ్ కి జోడీగా స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెళ్ళు నుపూర్ సనన్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ బ్యూటీ ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది.ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది.ఇక అక్కడ స్టార్ హీరోయిన్ కావడంతో ఆ బ్యాక్ అప్ కూడా కొంత వరకు నుపూర్ సనన్ కి కలిసోచ్చేలా ఉంది.

అక్క మాదిరిగానే టాలీవుడ్ ద్వారా ఇప్పుడు తేజ దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఈ అమ్మడుకి వరించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube