కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న..!!

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరగబోతున్న ఈ ఎన్నికలలో ఎలాగైనా అధికారం సాధించాలని ప్రధాన పార్టీలు మంచి వ్యూహాలు సిద్ధం చేసుకోవడం జరిగింది.

మరోపక్క కేసీఆర్( KCR ) ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు.ఇక ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా BRS పార్టీని దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.

ఇటువంటి తరుణంలో హైదరాబాద్ చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న( Teenmaar Mallanna ) తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారు.తెలంగాణ నిర్మాణ పార్టీ (TNP) స్థాపిస్తున్నట్లు స్పష్టం చేశారు.రాజకీయంగా సీఎం కేసీఆర్ ని ఎదుర్కోబోతున్నట్లు.

ఆయనను గద్దె దించడమే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానం ఉండనుందని స్పష్టం చేశారు.ఇదే సమయంలో తాను మేడ్చల్ అసెంబ్లీ నుండి హుస్నాబాద్ నుంచి దాసరి భూమయ్య పోటీ చేయబోతున్నట్లు.

Advertisement

తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.తెలంగాణ నిర్మాణ పార్టీ పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్ముకుని తన లాంటి వారిని అరెస్టు చేయించాడని.

కానీ తాను వికార్ సెక్షన్.నమ్ముకుని ముందుకు సాగిబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

అర్హత లేని వారు కూడా మంత్రులుగా సాగుతున్న క్యాబినెట్ ఇదే అని సెటైర్లు వేశారు.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు