పత్తి పంటలో పోషక ఎరువుల యాజమాన్యంలో మెళుకువలు..!

పత్తి పంటను( Cotton crop ) రైతులు తెల్ల బంగారంగా భావిస్తారు.ఎందుకంటే పత్తి పంటలో అధిక దిగుబడులు సాధిస్తే మంచి లాభాలు అర్జించవచ్చు.

 Techniques In The Management Of Nutrient Fertilizers In Cotton Crop , Cotton Cr-TeluguStop.com

అధిక దిగుబడులు సాధించాలంటే.పోషక ఎరువుల యాజమాన్యంలో సరైన పద్ధతులు పాటించాలి.

అధిక ప్రాధాన్యం సేంద్రియ ఎరువులకే ఇవ్వాలి.

ఒక హెక్టారు నేలకు 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు ( Cattle manure )అవసరం.60 కిలోల భాస్వరం, 100 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ ఎరువులను నాలుగు సమభాగాలుగా చేసుకుని పంట విత్తిన 20,40,60,80 రోజులకు మొక్కల మొదళ్ళ వద్ద వేయాలి.పత్తి పంటలో మెగ్నీషియం లోపం ఉంటే ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ముదురు ఆకుల అంచుల నుండి మధ్యభాగం పసుపు రంగులోకి మారుతుంది.

మెగ్నీషియం( Magnesium ) లోప నివారణ కోసం ఒక లీటరు నీటిలో 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

Telugu Cattle Manure, Cotton Crop, Magnesium, Fertilizers, Techniques, Zinc Sulp

పత్తి పంటలో జింక్ లోపం ఉంటే.కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతపడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది.ఒక లీటర్ నీటిలో రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ( Zinc Sulphate )కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

పత్తి పంటలో బోరాన్ లోపం ఉంటే.ఆకుల కాడలు ఒకే రీతిన ఉండక కొంత తలసరిగాను కొంత పలుచగా ఉండి పూత ఎండిపోవడంతో పాటు కాయలు రాలిపోతాయి.

మొక్కల ప్రధాన కాండం పై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది.కాబట్టి ఒక లీటర్ నీటిలో 1.5 గ్రా బోరాక్స్ ను కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారి చేయాలి.

Telugu Cattle Manure, Cotton Crop, Magnesium, Fertilizers, Techniques, Zinc Sulp

ఇక పత్తి పంటలో ఎప్పటికప్పుడు కలుపులు నిర్మూలించడంతోపాటు నేలలోని తేమ శాతం బట్టి నీటి తడులు అందించాలి.ముఖ్యంగా పత్తి పంట పూత, పిందె దశలో ఉన్నప్పుడు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.ఏవైనా చీడపీడలు ఆశిస్తే వెంటనే అరికట్టే ప్రయత్నం చేసి పంటను సంరక్షించుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube