యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణాన్ని చింతిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యార్జీలు ధరించి శ్రద్ధాంజలి ఘటించారు.శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కిడి చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మందుగుల బాలకృష్ణ,కరంటోత్ భిక్షపతి నాయక్,ఏపూరి సతీష్,ఎం.
డి నయిమ్, షరీఫ్,కోనురెడ్డి నరసింహ, రాసమల్ల యాదయ్య, ఉప్పల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.







