టీ బీజేపీ నాయకత్వం మరోసారి “బండి” చేతుల్లోనే?

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో తన సత్తా చాటి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా చేసుకొని దూకుడుగా రాజకీయాలు చేసి గతి పోటీ ఇచ్చిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి( Bandi sanjay kumar ) మార్పుతో ఒక సారిగా చతికిల పడింది .అప్పటివరకూ ముక్కోణపు పోటీ గా కనిపించిన తెలంగాణ రాజకీయం ఒక్క సారిగా కాంగ్రెస్ vs బిఆర్ఎస్ గా మారిపోయింది.

దీని వెనక ప్రధాన కారణం దూకుడు మంత్రం పఠించిన బండిని కంట్రోల్ చేయడమేనని మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.నూతన అధ్యక్షుడుగా పదవి బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి( Kishan Reddy ) కేవలం నామమాత్రపు మార్పులతోనే సరిపెట్టారు.బండి మార్క్ దూకుడు కిషన్ రెడ్డిలో కనిపించలేదు.

స్వయంగా ఆయన ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా పోటీ చేయకుండా తప్పించుకోవటం శ్రేణులకు తప్పుడు సంకేతాలు ఇచ్చింది అన్న విశేషణలు వినిపించాయి .

అయితే ఎట్టకేలకు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలతో సరిపెట్టుకున్న బిజెపి గతంతో పోలిస్తే మాత్రం బాగా పుంజుకున్నట్టే చెప్పాలి .అయితే ఈ మాత్రం గెలుపు కూడా బిజెపి సాధించింది అంటే అది బండి పుణ్య పుణ్యమేనని వివిధ నియోజకవర్గాల స్థాయిలో బీజేపీని ఆయన బలపరిచిన తాలూకూ ఫలితమే ఆ స్థానాలలో గెలుపని చాలామంది విశ్లేషించారు .దాంతో వచ్చిన ఫలితాలతో ఆలోచనలో పడిన బిజెపి( BJP ) అగ్ర నాయకత్వం మరోసారి బండికి పగ్గాలు అప్పచెప్పాలని చూస్తుందట.తెలంగాణలో మొదటి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడు మార్పు ఉంటుందని, పార్టీని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన బండిని తప్పించి తప్పు చేశామని గ్రహించిన అగ్రనాయకత్వం మరోసారి బండికి నాయకత్వం అప్పజెప్పాలని చూస్తుందట.

Advertisement

పార్లమెంటు ఎన్నికలకు బండి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలన్నది ప్రస్తుతానికి అగ్ర నాయకత్వం ఆలోచనగా తెలుస్తుంది.మరి అధ్యక్ష పదవికి బండి అంగీకరిస్తారు లేదో చూడాలి.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు