ఏపీలో పొత్తుల అంశం కీలకంగా మారింది.రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించి తాము అధికారంలోకి రావాలనే నిర్ణయానికి విపక్షాలు వస్తున్నాయి.
ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.ఇప్పటికే జనసేన ,బీజేపీ పొత్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో, టిడిపిని కలుపుకు వెళితే రాబోయే ఎన్నికల్లో తిరుగుండదని, వైసీపీని కచ్చితంగా ఓడించవచ్చు అనే అంచనాలో పవన్( Pawan kalyan ) ఉన్నారు.
విపక్షాల మధ్య ఓట్ల చీలిక లేకపోతే వైసీపీని ఓడించేందుకు సాధ్యమవుతుందనే అంచనాలో అటు టిడిపి అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నా, బిజెపి విషయంలో మాత్రం స్పష్టత లేదు.ముఖ్యంగా టిడిపి తో కలిసి వెళ్ళేందుకు బిజెపి అంతగా ఆసక్తి చూపించడం లేదు.

బిజెపి కలిసి వచ్చినా, రాకపోయినా టిడిపి, జనసేన మాత్రం అధికారికంగా పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నాయి.ఈ మేరకు నేడు, రేపు జరగబోయే టిడిపి మహానాడులో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఏపీలో వైసీపీని అధికారానికి దూరం చేయాలంటే, కచ్చితంగా టిడిపి, జనసేన, బిజెపి ల మధ్య పొత్తు అవసరమని అటు చంద్రబాబు ఇటు పవన్ భావిస్తున్నారు.అయితే టిడిపి అధినేత చంద్రబాబు తన నిర్ణయం ఇప్పటి వరకు ప్రకటించలేదు.
కానీ ఈరోజు జరగబోయే మహానాడులో దీనిపై ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారట.ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandra Mohan Reddy ) దీనిపై క్లారిటీ ఇచ్చారు.
టిడిపి, జనసేన పొత్తు అంశంపై పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు( Chandrababu Naidu ) అనేకసార్లు చర్చించారని, మహానాడులో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

పార్టీ పోలీస్ బ్యూరో తయారు చేసే రాజకీయ తీర్మానం ఈ ప్రకటన ఉండబోతున్నట్లు సమాచారం.ఈ రెండు పార్టీలు మధ్య పొత్తు వ్యవహారం అధికారికంగా ప్రకటించిన తర్వాత బిజెపి రియాక్షన్ ఏవిధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.గతంలో టిడిపి, బీజేపీలు పొత్తు పెట్టుకున్న సమయంలో టిడిపి వ్యవహరించిన తీరు, ఆ తరువాత బిజెపి అప్గ్రే నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేసిన విమర్శల నేపథ్యంలో టిడిపి తో పొత్తు అంశానికి బిజెపి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
బిజెపి తమతో కలిసి వచ్చినా, రాకపోయినా తాము మాత్రం పొత్తులతోనే ముందుకు వెళ్లాలని టిడిపి, జనసేన పార్టీల అధినేతలు ఉన్నారట.
