టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( ,Chandrababu Naidu ) ప్రస్తుతం జైల్లో ఉండడంతో ఆయనను బయటకు తీసుకోచ్చేందుకు పార్టీ నేతలు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు.పేరు మోసిన లాయర్లను రంగంలోకి దించుతున్నారు.
తమ పార్టీ అధినేతపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.అయితే స్కిల్ స్కామ్ లో పక్కా ఆధారాలతోనే చంద్రబాబును రిమాండ్ లో ఉంచామని ఏపీ సీఐడీ చెబుతోంది.కాగా ఈ కేసు విచారణపై ఏపీబీ కోర్టులో కూడా చంద్రబాబుకు ప్రతికూలతే ఎదురైంది.24 వరకు కస్టడీలోనే ఉండకతప్పదని తేల్చి చెప్పింది.అటు క్వాష్ పిటిషన్( Quash Petition ) పై కూడా హైకోర్ట్ లో చంద్రబాబుకు నిరాశే ఎదురైంది.
దీంతో తమ అధినేతను ఎలా బయటకు తీసుకురావలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ నేతలు.దానికి తోడు అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ పై చర్చిండేందుకు టీడీపీ ఎమ్మేల్యేలు విముఖత చూపుతుండడంతో స్కామ్ లు నిజంగానే జరిగాయా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.ఈ నేపథ్యంలో టీడీపీ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధినేత జైల్లో ఉంటే పార్టీపై ప్రతికూల ప్రభావాలు చూపే ఛాన్స్ ఉంది.అందుకే వీలైనంత త్వరగా చంద్రబాబును బయటకు తీసుకురావాలని టీడీపీ నేతలు డిసైడ్ అవుతున్నారు.
అయితే స్కిల్ స్కామ్ విషయంలో ఏసీబీ కోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న వేళ టీడీపీ నేతలు న్యాయవాదులతో భేటీ అయినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట టీడీపీ నేతలు.హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లలా లేదా సుప్రీం కోర్టు( Supreme Court )లో క్వాష్ పిటిషన్ వేయాలా ? అనే దానిపై న్యాయ సలహాలు తీసుకుంటున్నారట.ఆ తరువాత ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి స్కిల్ స్కామ్ లో పక్కా ఆధారాలు ఉండడంతో న్యాయవాదులు కూడా కాన్ఫిడెంట్ గా పోరాడలేకపోతున్నారని సమాచారం.మరి చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందో చూడాలి.