పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ టికెట్( TDP Undi Constituency Ticket ) పంచాయతీ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) వద్దకు చేరింది.నియోజకవర్గ అభ్యర్థి విషయంపై చెలరేగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం చంద్రబాబుకు దృష్టికి వెళ్లింది.
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకు( MLA Ramaraju ) పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది.దీంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు( Ex MLA Sivaramaraju ) తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రామరాజు మద్ధతు కోరినా శివరామరాజు తిరస్కరించారు.దీంతో ఇద్దరు నేతల మధ్య వివాదం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన వీరిద్దరూ రావాలని పిలిపించారు.చంద్రబాబుతో చర్చలు అనంతరం శివరామరాజు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.







