తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా పార్టీలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఇందులో భాగంగా పార్టీలు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ పోటీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చంద్రబాబు తెలిపారు.
ఇప్పటికే పోటీపై ప్రత్యేక కమిటీ వేశామన్న ఆయన ఎక్కడెక్కడ పోటీ చేయాలో కమిటీ ఫైనల్ చేస్తుందని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పారు.
అయితే గెలిచే స్థానాలపై దృష్టి సారించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో షెడ్యూల్ కంటే ముందే టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు.







