ఒక్కసారిగా టిడిపి తన వ్యూహాన్నిమార్చింది.మొన్నటి వరకూ టిడిపి టార్గెట్ గా ఉన్న జగన్ ని వదిలేసి చంద్రబాబు తో సహా అందరు విజయసాయి పైనే దృష్టి పెట్టారు.
అసలు ఎందుకు జగన్ ని వదిలి టిడిపి విజయసాయి రెడ్డి పై ఫోకస్ పెట్టింది.? చంద్రబాబు మొదలు టిడిపి కీలక నేతలు సైతం విజయసాయి టార్గెట్ గా చేసుకుని పావులు కదపడం కొన్ని రోజుల నుంచీ చూస్తూనే ఉన్నాం.టిడిపి ఈ రకమైన వ్యూహం ఎందుకు చేస్తోందో ఎవరికీ కూడా అంతుబట్టడం లేదు.విజయసాయి రెడ్డి పెద్దగా పార్టీలో పట్టు ఉన్న వ్యక్తీ కూడా కాదు…వైసీపి కేడర్ లో కూడా అంతగా పట్టు లేదు మరి ఎందుకు ఇంతగా టిడిపి టార్గెట్ చేస్తోందంటే.
బీజేపీ పార్టీ దగ్గర టీడీపీపై వ్యతిరేకత తీసుకుని రావడంలో మరియు.ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అవినీతిని సాక్ష్యాధారాలతో మోడీకి ఇవ్వటంలో విజయసాయి కీలక పాత్ర పోషించారు అనేవిషయం అందరికీ తెలిసిందే.
ఒక రకంగా చెప్పాలంటే బీజేపి ,టిడిపి భంధం విడిపోవడానికి పావులు కదిపిన వ్యక్తీ విజయసాయి.అందుకే చంద్రబాబు కి అండ్ టిడిపి నేతలకి అంతగా కోపం.
అంతేకాదు లోకేష్ అవినీతిపై వచ్చిన ఆరోపణల మూలాలు విజయసాయి బయటకి తీశాడని వాటిని మోడీ కి ఇచ్చాడని తెలుస్తోంది.అదొక్కటే కాదు ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ బ్యాంకు కుంభకోణంతోపాటు వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పేరుతో ఎంతెంత అవినీతికి పాల్పడింది.
వారి కేసుల లిస్టు తీసి మోడీ ముందు పెట్టారట.
అంతేకాదు చంద్రబాబు ని జైలుకి పంపుతా అంటూ ఒక చాలెంజ్ కూడా చేశారు విజయసాయి.
దాంతో చంద్రబాబు ఓ ఎంపీ అందులోనూ అనేక ఆర్ధిక కేసుల్లో బోనులో నులుచున్న వ్యక్తీ నన్ను నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతాడా అంటూ కోపం, ఆగ్రహం చంద్రబాబుకి నిద్రపట్టకుండా చేస్తున్నాయి…అందుకే విజయసాయి ని టిడిపి వాళ్ళు టార్గెట్ చేశారు.విజయసాయి దూకుడుకి గనుకా బ్రేకులు వేయకపోతే మును ముందు చాలా కష్టం అని గ్రహించిన చంద్రబాబు ఈ రకంగా టార్గెట్ చేశారని తెలుస్తోంది.
అయితే ఇక్కడ చంద్రబు తెలుసుకోవాల్సింది టార్గెట్ విజసాయి కాదు టార్గెట్ జగన్ అని.ఇదిలాఉంటే టిడిపి దృష్టి మళ్ళించడానికే పీకే ఈ విధమైన స్కెచ్ వేశాడని ఈ స్కెచ్ లో చంద్రబాబు బాగానే పడ్డారని విశ్లేషకుల అభిప్రాయం.