సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు..

సీఎం జగన్ పై టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే నాటికి చేతిలో పైసా లేదన్నారు.ఉన్న ఒక్క ఇల్లు అమ్ముకున్న వైఎస్ కుమారుడు జగన్ కు ఈరోజు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.స్వాతంత్ర్యం అనంతరం ఏపిలో 15 మంది ముఖ్యమంత్రులు 2 లక్షల కోట్లు అప్పులు వాడారని అన్నారు.

 Tdp State President Atchannaidu Was Furious With Cm Jagan. , Atchannaidu , Tdp-TeluguStop.com

కానీ జగన్ మూడున్నరేళ్లలో 9లక్షల27వేల కోట్లు అప్పులు చేశాడని మండిపడ్డారు.లక్షా ఎనబై వేలకోట్ల బటన్ నొక్కి సంక్షేమానికి ఖర్చు చేశామని జగన్ చెబుతున్నారని,మిగతా20 కోట్లు ఇతరత్రా ఖర్చులకు పోయినా మిగతా 7 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయో చెప్పాలన్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు కట్టావా అని అచ్చెన్న ప్రశ్నించారు.దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల ఆదాయం 117 కోట్లు అయితే జగన్ ఒక్కడి ఆదాయం 390 కోట్లు అని ఆరోపించారు.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని అచ్చెన్నాయుడు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube