రాబిన్ శర్మ ఎంట్రీ ! తిరుపతి లో వేడి పెంచుతున్న టీడీపీ ?

ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంది.

ఆ సమయంలో ఆ పార్టీ తమ రాజకీయ వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ ఉద్దంఢుడిని నియమించుకుంది.

ఎన్నికల సమయంలో పీకే టీం ఇచ్చిన సలహాలు, సూచనలతో ముందుకు వెళ్ళింది.అది బాగా వర్కౌట్ అవడంతో తిరుగులేని మెజారిటీతో ఏపీలో అధికారం చేపట్టింది.

వైసీపీ విజయంలో జగన్ భాగస్వామ్యం ఎంత ఉందో ప్రశాంత్ కిషోర్ భాగస్వామ్యం కూడా అంతే ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పుడు వైసిపి తరహాలోనే తెలుగుదేశం పార్టీ సైతం తమ పార్టీకి ఊపు తెచ్చే విధంగా రాజకీయ వ్యూహ కర్తలను నియమించింది.

గతంలో ప్రశాంత్ కిషోర్ వద్ద పనిచేసిన రాబిన్ శర్మ అనే వ్యక్తిని తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. పీకే టీమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహాలను అందించి, అమలు చేసే బాధ్యతను తీసుకున్నారు.

Advertisement

ఇప్పటికే ఎన్నో మార్పులు, చేర్పులు పార్టీలో చేపడుతూ, తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు.ప్రస్తుతం తిరుపతి ఎన్నికల హడావుడి ఉండటంతో, మరింత స్పీడ్ పెంచినట్లు కనిపిస్తున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి టిడిపిని తీసుకువెళ్లే వ్యూహాన్ని రాబిన్ శర్మ ప్రారంభించారు.దీని కోసం ప్రత్యేకంగా యాప్ ను తయారు చేయించినట్టు తెలుస్తోంది.

కొద్దిరోజులుగా రాబిన్ శర్మ తన టీంతో తిరుపతిలోనే మకాం వేసి మరి, పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.సోషల్ మీడియాలో పట్టు పెంచుకునేందుకు కొత్త గా తీసుకొచ్చిన ఐ టిడిపి యాప్ ద్వారా ప్రచారం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ని మరింత దెబ్బతీసేందుకు రాబిన్ శర్మ ఎత్తుగడలకు పదును పెట్టారు.ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల వ్యవహారశైలిపైన వివాదాస్పద అంశాలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

అలాగే టిటిడి విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి, ఇలా దేనిని వదిలిపెట్టకుండా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించేందుకు సిద్ధం చేసుకున్నారు.దీనికోసం రాబిన్ శర్మ కొన్ని ప్రత్యేక టీమ్ ను నియమించుకుని మరీ తిరుపతి తో పాటు, చిత్తూరు జిల్లాలో రహస్యంగా సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

ఈ వివరాలను ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కు తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

అలాగే తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వివిధ కమిటీలను నియమించడంతో పాటు, సుమారు ఎనిమిది వేల మంది కార్యకర్తలను రంగంలోకి దించి పార్టీ పరిస్థితి, తమ ప్రత్యర్థి వైసిపి వ్యవహారాల పైన ఆరా తీయిస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టిడిపి జెండా ఎగురవేసే విధంగా రాబిన్ శర్మ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.

తాజా వార్తలు