ఈనెల 28 నుంచి వరుస కార్యక్రమాలకు టిడిపి ప్రణాళికలు

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది.ఇందులో భాగంగా ఈనెల 28 నుంచి వరుస కార్యక్రమాలను నిర్వహించనుంది.

 Tdp Plans For Series Of Programs From 28th Of This Month-TeluguStop.com

ప్రజా సమస్యలపై పోరాటం, సంస్థాగత కార్యక్రమాలపై కార్యాచరణను రూపొందించనుంది.ఈనెల 28న హైదరాబాదులో  టిడిపి పోలీట్ బ్యూరో సమావేశం జరగనుంది.

అదేవిధంగా మేలు జరిగే మహానాడు నిర్వహణ, పలు అంశాలపై పోలీస్ బ్యూరోలో చర్చించనున్నారని తెలుస్తోంది.టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

అదేవిధంగా 29న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టిడిపి ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.ఏప్రిల్ తొలి వారంలో విశాఖపట్నం, నెల్లూరు, కడప జిల్లాల్లో టిడిపి జోన్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

అనంతరం టిడిపి నేతలు జనంలోకి వెళ్లేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి గ్రామస్థాయి నేత వరకు అందరూ క్షేత్రస్థాయిలో ఉండేలా కార్యక్రమాలను రూపొందించనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube